సీపీ కార్యాలయానికి హాజరైన మనోజ్..! 11 d ago
జల్ పల్లిలో జరిగిన ఘటన పై మంచు మనోజ్ రాచకొండ సీపీ కార్యాలయంలయానికి హాజరయ్యారు. విచారణ పూర్తయిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడుతూ తన తల్లి ఆసుపత్రి లో లేరని జల్ పల్లి లోని తన నివాసంలో ఉందని తెలిపారు. వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన్ సంస్థల్లో అక్రమాలు చేస్తున్నాడని, ఈ విషయాలేవి తన తండ్రికి తెలియవని చెప్పారు. సీపీని కలిసి జరిగిందంతా వివరించి తన వైపు నుండి ఎటువంటి గొడవ జరగదని చెప్పినట్లు మంచు మనోజ్ వివరించారు.